IND vs NZ 1st T20: ఓపెనర్‌గా శాంసన్, రింకూ ఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20కు టీమిండియా XI ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు పోరు మొదలవుతుంది. 37 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్... అదే జోరును టీ20 సిరీస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు వన్డే సిరీస్ ఓటమితో నిరాశ చెందిన భారత్ కనీసం పొట్టి ఫార్మాట్‌లోనైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి టీ20 మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Details
మరో ఓపెనర్ గా అభిషేక్ శర్మ
తొలి మ్యాచ్‌లో సంజూ సాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండటంతో పాటు వికెట్‌కీపర్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నాడు. అతనితో కలిసి యువ ఆటగాడు అభిషేక్ శర్మ మరో ఓపెనర్‌గా ఆడనున్నాడు. ఈ జోడీ ఇటీవల కాలంలో జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగనున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలు కీలక పాత్ర పోషించనున్నారు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ బ్యాట్‌తో పాటు బంతితోనూ జట్టుకు బలంగా నిలవనున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్‌కు చోటు దక్కనుంది. ఇక చివరి ఓవర్లలో శివమ్ దూబే, రింకూ సింగ్ ఫినిషర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఇద్దరి దూకుడు బ్యాటింగ్ టీమిండియాకు కీలకంగా మారనుంది.
Details
స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర
బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే.. పేస్ దళానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతనికి తోడుగా అర్షదీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయనున్నాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించనున్నాడు. యువతతో పాటు అనుభవజ్ఞుల సమ్మేళనంగా ఉన్న ఈ జట్టుతో న్యూజిలాండ్‌కు టీమిండియా గట్టి సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్ జట్టు కూడా బలంగా ఉండటంతో, తొలి టీ20 మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది చూడాలి.
Details
భారత జట్టు ఇదే
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.