
తమ జట్టులో మ్యాచ్ విన్నర్ ఉన్నారన్న శనక.. పాండ్యా ఎంతో పరిణతి చెందడన్న బంగర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ పైనల్ కు ముందు శ్రీలంక కెప్టెన్ డాసున్ శకన ఆకస్తికర వ్యాఖ్యలను చేశాడు.
మరోవైపు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పరిణతి చెందాడని మాజీ కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యనించాడు.
మెగా టోర్నీలో ప్రతి జట్టుకు విజయ అవకాశాలు ఉంటాయని, అయితే భారత్ తమకంటే ఇంకాస్త మెరుగ్గా ఉందని, స్వదేశంలో ఆడడం తమకు అడ్వాంటేజ్ అని శ్రీలంక కెప్టెన్ శనక పేర్కొన్నారు.
బ్యాటింగ్‌కు అనుకూలంగా పిచ్ లున్నాయని, అలాగే తమ స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని, తమ ప్రణాళికలు తప్పకుండా అమలు చేసి విజేతగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Details
భారత జట్టులో బౌలింగ్ ఎటాక్ అద్భుతంగా ఉంది : బంగర్
హార్ధిక్ పాండ్యా ఈ ఆసియా కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడని, ఆ బాధ్యతలను భుజానెత్తుకోవడం అభినందనీయమని సంజయ్ బంగర్ పేర్కొన్నారు.
కొంతకాలం ఫామ్, ఫిట్ నెస్ విషయంలో ఇబ్బంది పడ్డాడని, అయితే ఈ సారి మాత్రం ఫిట్ నెస్ అందుకున్నాడని పేర్కొన్నారు.
ప్రస్తుతం భారత జట్టులో బౌలింగ్ ఎటాక్ అద్భుతంగా ఉందని, బుమ్రా, సిరాజ్, షమీతో పాటు కుల్దీప్ యాదవ్ వైవిధ్యంగా బంతులను సంధిస్తున్నారని వెల్లడించారు.
మరోవైపు రవీంద్ర జడేజా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టేస్తున్నారని బంగర్ వెల్లడించారు.