Sanju Samson Century: 5 సెంచరీల్లో 2 సంజూవే - వాంఖడేలో అద్భుత ప్రదర్శన..అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై
ఈ వార్తాకథనం ఏంటి
గురువారం రాత్రి జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో అతను అజేయ శతకంతో మెరిశాడు. అతని బ్యాటింగ్‌ను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయారు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్‌లో బౌండరీ కొట్టి, ఆ ఓవర్ మొత్తంగా 16 పరుగులు రాబట్టి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
వివరాలు
సంజూకు అభినందనల వెల్లువ..
ముఖ్యంగా, చివరి బంతికి సెంచరీ పూర్తి చేసిన వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వయంగా మైదానంలోకి వచ్చి హైఫైవ్ ఇచ్చి అభినందించాడు. అతనితో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా సంజూ దగ్గరకు వెళ్లి అభినందనలు తెలిపాడు. అలాగే టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సంజూను హత్తుకుని అభినందించడంతో ఆ దృశ్యం అభిమానులను ఉత్సాహపరిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
What a player 🔥
— Star Sports (@StarSportsIndia) April 23, 2026
Sanju Samson lights up Wankhede with a sensational century 💯💛
✅ First century by a CSK batter vs MI
✅ 5th century in #TATAIPL#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/CrPljNVO3Y