LOADING...
Sarfaraz Khan: అతడు కూడా సెంచరీ చేస్తే బాగుండేది: సర్ఫరాజ్‌ ఖాన్‌ 
అతడు కూడా సెంచరీ చేస్తే బాగుండేది: సర్ఫరాజ్‌ ఖాన్

Sarfaraz Khan: అతడు కూడా సెంచరీ చేస్తే బాగుండేది: సర్ఫరాజ్‌ ఖాన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్‌ వేదికగా బుధవారం ముంబయి,గోవా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన గోవా బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో ముంబయి మొదట బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో ముంబయి జట్టు 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గోవా జట్టు 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా, ముంబయి 87 పరుగుల తేడాతో గెలిచింది. ముంబయి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. చివరికి 75 బంతుల్లో 157 పరుగులు చేసి (9 ఫోర్లు, 14 సిక్స్‌లు) ఔటయ్యాడు.

వివరాలు 

చక్కటి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ  వెలితి:సర్ఫరాజ్‌ 

ఈ ప్రదర్శనతో తనను టీమ్‌ఇండియాకు ఎంపిక చేసే విషయంలో సెలక్టర్లపై అతడు ఒకరకంగా ఒత్తిడి పెంచాడు అయితే తాను చక్కటి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ తనకు వెలితి ఉందని ఓ ఆంగ్ల పత్రికతో అన్నాడు. ఈ మ్యాచ్‌లో అతడి సోదరుడు ముషీర్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించాడు. అయితే, అతను కూడా సెంచరీ సాధిస్తే బాగుండేదని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు.

వివరాలు 

ఆ కల నెరవేరుతుందనుకున్నాం,కానీ సాధ్యం కాలేదు:  సర్ఫరాజ్‌ 

"నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రన్ రేట్ ఎక్కువగా లేదు.మా ఓపెనర్లు మొదట ఆచితూచి ఆడారు. నిజానికి,బంతికి అనుకూల పరిస్థితుల్లోనే వేగంగా పరుగులు రాబట్టడం సులభం కాదు.అందుకే ముందుగా క్రీజులో స్థిరపడాలని ప్రయత్నించాను.పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించాకే ఎదురు దాడి ప్రారంభించాను.నా లక్ష్యం సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేసి,ప్రత్యర్థికి ముందు గరిష్ట లక్ష్యం నిర్దేశించడం"అని సర్ఫరాజ్‌ ఖాన్‌ వివరించాడు. అలాగే అతడి సోదరుడు ముషీర్‌ఖాన్‌ ఇన్నింగ్స్‌ గురించి కూడా సర్ఫరాజ్‌ మాట్లాడాడు. "నేను క్రీజులోకి వచ్చినప్పుడు ముషీర్ బ్యాటింగ్‌లో ఉండేవాడు.అతను అర్ధశతకానికి చేరాడు.మేము ఇద్దరం ఒకే మ్యాచ్‌లో సెంచరీ సాధించాలనే కలను కలిగి ఉన్నాం.రంజీ ట్రోఫీలో కూడా మేము హాఫ్ సెంచరీలు చేసి ఔటయ్యాం.ఈమ్యాచ్‌లో ఆ కల నెరవేరుతుందనుకున్నాం,కానీ సాధ్యం కాలేదు" అని సర్ఫరాజ్ తెలిపాడు.

Advertisement