బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్ - చిరాగ్ జోడీ అల్ టైం రికార్డు
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి వరుస విజయాలతో దూసుకెళ్తుతున్నారు. ఆదివారం కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో సాత్విక్, చిరాగ్ జోడి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత ద్వయం 17-21, 21-13, 21-14తో ప్రపంచ నంబర్‌వన్ జోడీ ఫజర్ అల్ఫియాన్, మహమ్మద్ రియాన్‌పై వారు గెలుపొందారు. తాజాగా మంగళవారం విడుదలైన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ లోనూ సత్తా చాటారు. సాత్విక్-చిరాగ్ జోడి డబుల్స్ విభాగంలో తమ కెరీర్ లోనే బెస్ట్ రెండో ర్యాంకును సాధించారు. అదేవిధంగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో వీరిద్దరూ ఆడిన 10 ఫైనల్ మ్యాచుల్లోనూ గెలుపొందడం విశేషం.
17వ స్థానంలో పీవీ సింధు
ప్రస్తుతం సాత్విక్-చిరాగ్ జోడీ జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నీని కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మంగళవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. తెలుగు తేజం పివి.సింధు వరుస పరాజయాల కారణంగా ర్యాంకింగ్స్ లో మరింత కిందకు దిగజారింది. కొరియా ఓపెన్ లో తొలి రౌండ్ లోనే నిరాశపరిచన సింధు ప్రస్తుతం ర్యాంకింగ్స్ లో 17వ స్థానంలో కొనసాగుతోంది. సైనా నెహ్వాల్ 37వ స్థానంలో ఉండగా.. పురుషుల సింగిల్స్ విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ 10వ స్థానంలో ఉన్నాడు.