కొరియా ఓపెన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన సాత్విక్‌సాయిరాజ్
కొరియా ఓపెన్‌లో ఇండియన్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును తన పేరిట రాసుకున్నాడు. అత్యంత వేగవంతమైన స్మాష్ కొట్టిన మేల్ ప్లేయర్ గా నిలిచాడు. అతడు ఏకంగా గంటకు 565 కిలోమీటర్ల వేగంతో స్మాష్ హిట్ కొట్టాడు. ఈ హిట్ తో పదేళ్ల రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు. అదేవిధంగా పురుషుల బాడ్మింటన్ లో కాక్ ను బలంగా కొట్టిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. గతంలో మలేషియా ఆటగాడు టాన్ బూన్ హీంగ్ 2013లో గంటకు 493 కిలోమీటర్ల వేగంతో స్మాష్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మధ్యే తన డబుల్స్ పార్ట్‌నర్ చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీ గెలిచాడు
ఆరో ర్యాంకును సొంతం చేసుకున్న సాత్విక్ - చిరాగ్ జోడీ
ఇక మహిళల బ్యాడ్మింటన్ లో మలేషియాకు చెందిన టాన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో ఓ షాట్ కొట్టి అగ్రస్థానంలో ఉంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే, సాత్విక్-చిరాగ్ జోడీ 21-16, 21-14 తేడాతో జొమ్‌కొహ్, కిట్టినుపాంగ్ కెడ్రెన్‌పై గెలుపొందారు. ఈ భారత జోడీ 32 నిమిషాల్లోనే మ్యాచును ముగించడం విశేషం. ఈ విజయంతో వీరు క్వార్టర్స్ లో అడుగుపెట్టారు. కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న సాత్విక్ - చిరాగ్ డబుల్స్‌లో ఆరో ర్యాంక్ సొంతం చేస్తున్నారు.