సాత్విక్, చిరాగ్ జోడీకి కెరీర్లోనే బెస్ట్ ర్యాంకు
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ షట్లర్లు సాత్విక్, చిరాగ్ కెరీర్లోనే అత్యత్తుమ ర్యాంకును అందుకున్నారు. ఇటీవలే ఇండోనేషియా సూపర్ 1000 టైటిల్ గెలిచి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇండోనేషియా ఓపెన్లో కెరీర్లో తొలి సూపర్ 1000 టైటిల్ నెగ్గిన ఈ జంట బీడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 3 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు నిలిచారు. తమ కెరీర్ లో మొదటి సారిగా ఈ జోడీ టాప్-3లోకి చేరుకోవడం విశేషం. గతంలో 5వ ర్యాంకును అందుకున్న ఈ జోడీ ఇండినేషియా టైటిల్ ర్యాంకింగ్స్ లో మరింత పైకి ఎగబాకారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ పూయి యికులపై 21-17, 21-18 తేడాతో విజయం సాధించారు
మహిళల సింగిల్స్ లో 12వ ర్యాంకుకు చేరుకున్న పీవీ సింధు
పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన 18, కిదాంబి శ్రీకాంత్ 19 ర్యాంకులు సాధించారు. అదే విధంగా ఇండోనేషియా టోర్నీ సెమీఫైనల్లో విక్టర్ అక్సెల్ సెన్ చేతిలో ఓడిన హెచ్ఎస్ ప్రణయ్ తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రియన్షు రాజావ్ 4 స్థానాలు ఎగబాకి 30వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్ లో పీవీ.సింధు 12, సైనా నెహ్వాల్ 31 ర్యాంకుల్లో ఉన్నారు. మహిళల డబుల్స్ లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ 16, అశ్వినిభట్-శిఖా గౌతమ్ 41 ర్యాంకులు సాధించారు.