Page Loader
బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..?
స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోరులో పీవీ సింధు

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. స్వీస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రౌండ్ రౌండ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. ఈ సీజన్లో టైటిల్ కొట్టాలని పీవీ సింధు పట్టుదలతో ఉంది. మంగళవారం ప్రారంభమయ్యే టోర్నీ సింగల్స్‌లో ఆమె రెండో సీడ్‌గా పోటీలో నిలవనుంది. ఈ ఏడాది ఆడిన రెండు టోర్నమెంట్లో కనీసం రౌండ్ కు సింధు చేరలేకపోయింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో తెలియడం లేదు. ఎలాగైనా టైటిల్ కట్టి టోర్నీని ప్రారంభించాలని పీసీ సింధు కసితో ఉంది. స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌, మాల్విక బన్సోద్‌, ఆకర్షి కశ్యప్‌ ఈ సీజన్లో పోటీపడుతుండటం విశేషం.

కిదాంబి శ్రీకాంత్

కిదాంబి శ్రీకాంత్ సత్తా చాటేనా..?

మరోవైపు చెత్త ప్రదర్శనతో ఫామ్‌ను కోల్పోయినా కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నిమెంట్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అయిదో సీడ్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లో థమాసిన్(థాయలాండ్) తో పోటీపడనున్నాడు. మరోవైపు సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో బుసానన్ (థాయ్‌లాండ్)తో తలపడనుంది. స్విస్ ఓపెన్లో టైటిల్ సాధించిన భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి స్పెయిన్ మాస్టర్‌లోనూ హాట్ ఫెవరెట్స్‌గా బరిలోకి దిగనున్నారు. తొలి రౌండ్‌లో వారు అయాటో-యుటా టకాయ్(జపాన్)తో ఆడనున్నారు. జాతీయ ఛాంపియన్‌ మిథున్‌ మంజునాథ్‌, సమీర్‌వర్మ, సాయిప్రణీత్‌ కూడా ఈ టోర్నీలో టైటిల్ పోరు కోసం పోటీ పడనున్నారు.