Page Loader
Diamond League Final:డైమండ్ లీగ్‌లో నీరజ్ చొప్రాకు రెండో స్థానం
డైమండ్ లీగ్‌లో నీరజ్ చొప్రాకు రెండో స్థానం డైమండ్ లీగ్‌లో నీరజ్ చొప్రాకు రెండో స్థానం

Diamond League Final:డైమండ్ లీగ్‌లో నీరజ్ చొప్రాకు రెండో స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2023
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

యూజీన్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్లో భారత్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా టైటిల్ రెండో స్థానంలో నిలిచారు. ఈ పోటీలో చెక్ రిపబ్లిక్ చెందిన జాకుబ్ వాడ్లెచ్ 84.01 బెస్ట్ త్రోతో ఛాంపియన్‌గా నిలిచాడు. ఇక నీరజ్ తర్వాత చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొగనున్నారు. నీరజ్ 83.80 మీటర్లు విసిరి రెండో స్థానానికి చేరుకున్నారు. చివరి మ్యాచులో నీరజ్ చోప్రాకు శుభారంభం లేకపోవడంతో అతని తొలి త్రో ఫౌల్ అయ్యింది.

Details

నీరజ్ చోప్రా సాధించిన ఘనతలు ఇవే!

ఇటీవల బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ 88.17 మీటర్ల బెస్ట్ త్రోతో దేశానికి బంగార పతకాన్ని అందించిన విషయం తెలిసిందే. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని అందించాడు. మరోవైపు 25 ఏళ్ల నీరజ్ చోప్రా డైమంగ్ లీగ్ లోని ఏదైనా అథ్లెటిక్స్ ఈవెంట్ లో టైటిల్ గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు.