తదుపరి వార్తా కథనం

IND vs BAN: తోలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకే ఆలౌట్..
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 30, 2024
01:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో,బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌటైంది.
మొమినల్ హక్ 107*(నాటికీ) పరుగులతో సెంచరీ సాధించగా,మిగతా బ్యాటర్లు నిరాశపరచారు.
భారత పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా 3,సిరాజ్ 2,ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయగా,స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు.
బంగ్లాదేశ్ 107/3 స్కోరుతో ఓవర్‌నైట్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
మొదటి రోజున 35 ఓవర్లు మాత్రమే ఆడగా,గత రెండు రోజులు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది.
బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ శాంటో (31),షద్మాన్ ఇస్లామ్ (24),మెహిదీ హసన్ మిరాజ్ (20), లిటన్ దాస్ (13), ముష్ఫికర్ రహీమ్ (11), షకిబ్ (9) సరిగ్గా రాణించలేదు.