IPL 2025: ఏప్రిల్ 6న బెంగాల్‌లో భద్రతా సమస్యలు.. ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ పై చర్చలు!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభంకానుంది.
తొలిమ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నారు.
అయితే ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Details
రీషెడ్యూల్ కారణం ఏమిటి?
శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న బెంగాల్‌లో భారీ ర్యాలీలు జరగనున్నాయి. సుమారు 20,000కి పైగా ప్రదేశాల్లో బీజేపీ నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ కారణంగా భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బెంగాల్ పోలీసులు తెలిపారు.
పోలీసుల అనుమతి లేకపోవడం
ఈ అంశంపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కార్యదర్శి స్నేహశిశీష్ గంగూలీ స్పందించారు.
ఇప్పటికే నగర పోలీసులతో రెండు సమావేశాలు నిర్వహించినప్పటికీ, మ్యాచ్ నిర్వహణకు అనుమతి మంజూరు చేయలేమని అధికారులు స్పష్టంచేశారు.
Details
భద్రతను కల్పించలేం
పోలీసులు భద్రత కల్పించలేమని పేర్కొన్నారు. 65,000 మంది ప్రేక్షకులను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. మ్యాచ్ నిర్వహణపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లామని స్నేహశిశీష్ గంగూలీ వెల్లడించారు.
మ్యాచ్ షెడ్యూల్ మారుతుందా?
పోలీసుల అనుమతి లేకపోవడంతో మ్యాచ్ తేదీలో మార్పు చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది