Loading...
Shadman Islam: వెస్టిండీస్‌తో టెస్టులో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో మైదానం వీడిన ఓపెనర్!
వెస్టిండీస్‌తో టెస్టులో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో మైదానం వీడిన ఓపెనర్!

Shadman Islam: వెస్టిండీస్‌తో టెస్టులో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో మైదానం వీడిన ఓపెనర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం చీలమండ గాయంతో మైదానంలోనే కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై మైదానం వెలుపలకు తీసుకెళ్లారు. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 78వ ఓవర్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అమీర్ జాంగూ బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఆ సమయంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాద్‌మన్ బంతిని అడ్డుకునేందుకు పరుగెత్తాడు. అయితే బంతిని అందుకునే ప్రయత్నంలో అతడు అదుపుతప్పి జారిపడ్డాడు.

వివరాలు

జారిపడిన షాద్‌మన్

ఈ క్రమంలో అతడి ఎడమ చీలమండకు గాయమైంది. రీప్లేలను పరిశీలించగా.. ఔట్‌ఫీల్డ్‌లో మంచు ఉండటంతోనే షాద్‌మన్ జారిపడినట్లు కనిపించింది.

షాద్‌మన్ గాయంపై బంగ్లాదేశ్ ఫిజియో బాయ్జెదుల్ ఇస్లాం ఖాన్ స్పందించాడు. అతడి ఎడమ చీలమండ మెలిక పడిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని వెల్లడించాడు.

గాయం తీవ్రతను తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐ స్కాన్ చేయించనున్నట్లు తెలిపాడు.

తొలి టెస్టులో సెంచరీ సాధించిన షాద్‌మన్.. రెండో టెస్టులో మళ్లీ బ్యాటింగ్‌కు వస్తాడా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

వివరాలు

నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు

ఒకవేళ గాయం కారణంగా అతడు మిగిలిన మ్యాచ్‌కు దూరమైతే.. బంగ్లాదేశ్ జట్టు మిగతా ఆటను పది మంది ఆటగాళ్లతోనే కొనసాగించాల్సి ఉంటుంది.

తొలి రోజు ఆటలో వెస్టిండీస్ 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో నిర్ణీత సమయానికి ముందుగానే ఆటను నిలిపివేశారు.

అయితే రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే షాద్‌మన్ గాయపడటం బంగ్లాదేశ్ శిబిరంలో ఆందోళన కలిగించింది.

ప్రస్తుతం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 322/8 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.

ADVERTISEMENT