Shaheen Shah Afridhi : వన్డేల్లో చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది.. ఫాస్ట్ బౌలర్‌గా సరికొత్త రికార్డు!
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డన్స్ లో ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ . ఈ మ్యాచులో పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది సరికొత్త రికార్డును సృష్టించాడు. మొదటి ఓవర్ 5వ బంతికి బంగ్లాదేశ్ బ్యాటర్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టి ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ బౌలర్లలో ఇంతవరకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.
ఫాస్ట్ బౌలర్ల జాబితాలో షాహీన్ అఫ్రిది అగ్రస్థానం
మొత్తం 51 వన్డేల్లో షాహీన్ అఫ్రిది 100 వికెట్లు తీసి సత్తా చాటాడు. అతని తర్వాత స్కార్ట్(52), సక్లైన్ ముస్తాక్ 53 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించారు. స్పిన్నర్ల జాబితాలో సందీప్ లామిచానే 42 ఇన్నింగ్స్ లో 100 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాత టాప్-2లో రషీద్ ఖాన్(44) ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ల జాబితాలో షాహీన్ అఫ్రిది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.