Shakib Al Hasan: వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్
బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. షకీబ్ త్వరలో జరగనున్న ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ కు నాయకత్వం వహించనున్నారు. తమీమ్ ఇక్బాల్ వన్డే కెప్టెన్ గా తప్పుకోవడంతో అతని స్థానంలో షకీబ్ నియమితులయ్యారు. తమీమ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో లిట్టన్ దాస్ వైఎస్ కెప్టెన్‌గా ఉన్నాడు. సెలెక్టర్లు మాత్రం వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని అనుభవజ్ఞుడైన షకీబ్ అల్ హసన్ వైపే మొగ్గు చూపారు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 లో పాల్గొనే ప్లేయర్ల వివరాలను రేపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించనుంది.
షకీబ్ అల్ హసన్ సాధించిన రికార్డులివే
షకీబ్ గతంలో 2011 వన్డే వరల్డ్ కప్‌తో సహా 50 ఓవర్ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహించాడు. అతని నాయకత్వంలో బంగ్లా 23 వన్డేల్లో నెగ్గగా, మరో 26 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఈ ఫార్మాట్లో షకీబ్ 35.97 సగటుతో 1,547 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో 29.23 సగటుతో 68 వికెట్లను పడగొట్టాడు. షకీబ్ ఇప్పటివరకు 235 వన్డే మ్యాచులు ఆడి 37.55 సగటుతో 7,211 పరుగులు చేశాడు. ఇందులో 53 హాఫ్ సెంచరీలు, తొమ్మిది సెంచరీలను బాదాడు. బౌలింగ్ విభాగంలో 305 వికెట్లను పడగొట్టాడు. అయితే షకీబ్ అన్ని ఫార్మాట్లలో సారథిగా కొనసాగుతాడా లేదో వేచి చూడాలి.