Page Loader
BCB: ఆఖరి టెస్టుకు షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చీఫ్‌ ఫరూఖీ
ఆఖరి టెస్టుకు షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చీఫ్‌ ఫరూఖీ

BCB: ఆఖరి టెస్టుకు షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చీఫ్‌ ఫరూఖీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 27, 2024
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ బంగ్లాదేశ్ క్రికెటర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ టీ20లకు వీడ్కోలు ప్రకటించడంతో పాటు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''బంగ్లాదేశ్‌కు వెళ్లడం పెద్ద సమస్య కాదు, కానీ వెళ్లి బంగ్లాదేశ్‌ను వదిలి రావడం కష్టం. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నా భద్రత గురించి చింతిస్తున్నారు'' అని షకిబ్ పేర్కొన్న వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సొంత దేశంలో చివరి టెస్టు ఆడాలని ఉందని కూడా షకిబ్ మనసులోని మాటను వెల్లడించారు.

వివరాలు 

వ్యక్తిగతంగా క్లిష్టపరిస్థితి 

ఈ నేపథ్యంలో, షకిబ్ భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫరూఖీ అహ్మద్ స్పందిస్తూ,''షకిబ్ సెక్యూరిటీ మా పరిధిలో లేదు. బోర్డు వ్యక్తిగతంగా ఎవరికి భద్రత కల్పించదు.అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.భద్రతా అంశాలపై ప్రభుత్వమే కీలకంగా స్పందిస్తుంది.పోలీస్ లేదా రాబ్(ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్) మాదిరిగా బీసీబీ సెక్యూరిటీ ఏజెన్సీ కాదు. దీనిపై నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ పాత్ర'' అని స్పష్టం చేశారు. ఫరూఖీ అహ్మద్ మాట్లాడుతూ, ''షకిబ్ బంగ్లాదేశ్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ ప్రస్తుతం అతడి వ్యక్తిగత పరిస్థితి క్లిష్టంగా ఉంది.అతడు తన చివరి టెస్టు సొంత మైదానంలో ఆడాలని కోరుకున్నాడు,దానికి మాకు అభ్యంతరం లేదు.కానీ భద్రతకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వలేం. ఇది అతడి నిర్ణయమని గౌరవిస్తాం''అని తెలిపారు.

వివరాలు 

రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం: షకిబ్ 

షకిబ్ కూడా ''చివరిసారిగా నేను టీ20 ప్రపంచకప్‌లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాను. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని సెలెక్టర్లతో చర్చించా. నా స్థానంలో మరింత మంచి ఆటగాళ్లు జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా'' అని వెల్లడించారు.