Page Loader
World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!
ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!

World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ (WTC) ఫైన‌ల్‌కు రంగం సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే లండన్‌ చేరుకుంది. జూన్ 11న లార్డ్స్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు శిక్షణ కొనసాగించేందుకు శనివారం మైదానానికి చేరిన ఆ జట్టుకు ఓ ఊహించని అనుభవం ఎదురైంది. శిక్షణ కోసం వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం దక్కలేదు. లార్డ్స్‌ మైదానంలో శిక్షణ కోసం అవసరమైన అనుమతి ఆ జట్టుకు అందకపోవడంతో ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టుల ప్రకారం, శనివారం అదే సమయంలో భారత జట్టు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ఆసీస్‌కు ఎంట్రీ ఇవ్వలేదని ఫాక్స్ క్రికెట్ పేర్కొంది.

Details

ఆస్ట్రేలియా జట్టుకు అనుమతి లేదు

ఇటీవలే భారత్ జట్టు కూడా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా అక్కడికి చేరింది. జూన్ 20 నుంచి ప్రారంభంకానున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం భారత్ శనివారం లార్డ్స్‌లో శిక్షణలో పాల్గొంది. అప్పటికే భారత జట్టుకు మైదానంలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇవ్వబడింది. దీంతో అదే సమయంలో వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు పర్మిషన్ లభించలేదు. అయితే ఆదివారం పరిస్థితి మారింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆస్ట్రేలియా జట్టు లార్డ్స్‌లోనే శిక్షణ కొనసాగించింది.

Details

జూన్ 20 నుంచి ఆరంభం

వాస్తవానికి డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌ తొలి రోజు జూన్ 11 కాగా, భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు జూన్ 20 నుంచి ఆరంభం కాబోతుంది. అయినప్పటికీ శనివారం భారత జట్టుకు ప్రాధాన్యత ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ సంఘటనను చాలా మంది ఆశ్చర్యంగా స్వీకరిస్తున్నారు. అంత కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమవుతున్న జట్టుకు మైదానంలో ప్రాక్టీస్ కు అవకాశం లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.