Page Loader
Mohammed Shami: ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ
ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ

Mohammed Shami: ప్రధాని మోదీ ఓదార్చడంతో ధైర్యం వచ్చింది : మహ్మద్ షమీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2023
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో టీమిండియా(Team India) ఓటమి భారత క్రికెట్ అభిమానులను ఎంతో బాధించింది. ఇక ఆటగాళ్ల పరిస్థితి మాటల్లో చెప్పలేం. ప్రదాని నరేంద్ర మోదీ(Narendra Modi) స్వయంగా జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పడంలో ప్రతి భారతీయుడిలో స్ఫూర్తి నింపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami), ప్రధాని మోదీ రావడంపై స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించి, ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్లో ఓడిపోయాక డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్లందరం మౌనంగా ఉండిపోయామని, ఎవరూ కూడా అన్నం తినలేదని షమీ చెప్పాడు.

Details

మోదీ పరామర్శ ఉపయోగపడింది : షమీ

మొదట మోదీ వస్తారన్న సమచారం తమకు తెలియదని, ఆయన డ్రెస్సింగ్ రూంలోకి రావడంతో ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగిందన్నారు. మోదీ దగ్గరికొచ్చి ఒక్కొక్కరితో మాట్లాడిన తర్వాతే తమలో ధైర్యం వచ్చిందని మహ్మద్ షమీ వెల్లడించారు. ఆయన పరామర్శ తమకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. మైకాళ్ల కూర్చున్న సమయంలో షమీ ప్రార్థనలు చేయాలని అనుకున్నాడని, కానీ భారత్ లో అలా చేసేందుకు భయపడ్డాడని పాక్ అభిమానులు పోస్టు చేశారు. దీనిపై షమీ స్పందించాడు. ఎవరైనా ప్రార్థన చేయాలనుకుంటే తనను ఎవరు ఆపుతారని, తాను ఎవరినీ ఆపరని షమీ చెప్పాడు.