Loading...
Mohammed Shami: ప్రపంచకప్‌లపై షమీ సంచలన వ్యాఖ్యలు.. అసలు ప్లాన్ ఇదే!
ప్రపంచకప్‌లపై షమీ సంచలన వ్యాఖ్యలు.. అసలు ప్లాన్ ఇదే!

Mohammed Shami: ప్రపంచకప్‌లపై షమీ సంచలన వ్యాఖ్యలు.. అసలు ప్లాన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని స్పష్టం చేశాడు. ఆటపై దృష్టి పెట్టడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం, మంచి రిథమ్‌లో కొనసాగడమే తన ప్రాధాన్యత అని తెలిపాడు. జాతీయ జట్టులో ఎంపిక విషయంలో సెలెక్టర్లు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తానని పేర్కొన్నాడు. ముంబైలో మీడియాతో మాట్లాడిన షమీకి.. 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ తన ప్రణాళికల్లో ఉన్నాయా? అని ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ''ఇలాంటి విషయాల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాను.

వివరాలు

ఆటను ఆస్వాదించాలి

ప్రస్తుతం నా ఆటపైనే దృష్టి పెడుతున్నాను. సెలెక్టర్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచికే అవుతుంది.

నా వైపు నుంచి చేయాల్సిందల్లా ఆటను కొనసాగించడం, మంచి రిథమ్‌లో ఉండటం. కనీసం రాష్ట్ర జట్టు, ఐపీఎల్ తరఫున అయినా క్రికెట్ ఆడుతుండాలని చెప్పాడు.

దేశవాళీ క్రికెట్‌లో కొనసాగడానికి గల కారణాన్ని కూడా షమీ వివరించాడు. క్రికెట్‌పై ఇష్టం, ఆటను ఆస్వాదించడమే తనకు ప్రేరణ అని తెలిపాడు.

యువ ఆటగాళ్లకు తన అనుభవాన్ని పంచడం కూడా ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నాడు. ''మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉన్నంతకాలం, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం ఆడుతూనే ఉండాలి.

వివరాలు

తన

రాష్ట్ర జట్టు తరఫున ఆడుతున్నప్పుడు యువ ఆటగాళ్లు నా నుంచి ఏదైనా నేర్చుకుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? అనుభవం చాలా ముఖ్యం.

ఏ స్థాయిలో ఆడుతున్నా మనకు తెలిసిన విషయాల్లో కొంతైనా యువ ఆటగాళ్లకు నేర్పించాలని షమీ చెప్పాడు.

ప్రస్తుతం దేశవాళీ టోర్నీలో ఆడటాన్ని రిటైర్మెంట్‌తో ముడిపెట్టవద్దని స్పష్టం చేశాడు. వైట్‌బాల్ క్రికెట్‌ను కొనసాగిస్తానని, అవసరమైతే ఫిట్‌నెస్ కోసం రెడ్‌బాల్ క్రికెట్ కూడా ఆడతానని తెలిపాడు.

గత 15 నుంచి 20 ఏళ్లుగా తాను అనుసరిస్తున్న విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు వివరించాడు.

టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై కూడా షమీ స్పందించాడు. శరీరంపై ఎక్కువ భారం పడకుండా ఉండేందుకు, కెరీర్‌కు ఏది మంచిదో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు

ADVERTISEMENT

వివరాలు

తన

. ''నాకు అది సరైన నిర్ణయంగా అనిపించింది. అందుకే రిటైర్మెంట్ తీసుకున్నాను. ప్రస్తుతం బాగా కదలగలుగుతున్నాను, బాగా ఆడుతున్నాను.

కాబట్టి వైట్‌బాల్ క్రికెట్‌ను స్వేచ్ఛగా ఆస్వాదిస్తాను. శరీరంపై మరీ ఎక్కువ భారం వేయడం మంచిది కాదని పేర్కొన్నాడు.

ఇటీవలే షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2013 నవంబర్ 6న వెస్టిండీస్‌తో టెస్టు అరంగేట్రం చేసిన అతడు.. 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు.

భారత్ తరఫున 64 టెస్టులు ఆడిన షమీ.. 122 ఇన్నింగ్స్‌ల్లో 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 6/56. టెస్టుల్లో 12 సార్లు నాలుగు వికెట్లు, ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.

ADVERTISEMENT