#Viral Movement: శార్దూల్ వేసిన 'డ్రీమ్ డెలివరీ'కి శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. 11వ ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ ఒక వికెట్ నష్టానికి 107 పరుగులు చేసి బలమైన స్థితిలో కనిపించింది. ఈ పరిస్థితిలో ముంబై తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, 12వ ఓవర్ బాధ్యతను శార్దూల్ ఠాకూర్‌కు అప్పగించాడు. ఆ ఓవర్ రెండో బంతికే సెంచరీ దిశగా వెళ్తున్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను ఔట్ చేసిన శార్దూల్, ముంబైకి కీలక బ్రేక్ అందించాడు.
వివరాలు
ఆ బంతికి సమాధానమే లేదు..
ప్రభ్‌సిమ్రాన్ ఔట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఎదుర్కొన్న మొదటి బంతినే బౌండరీకి తరలిస్తూ మంచి ఆరంభం చేశాడు. అయితే ఆ ఉత్సాహం ఎక్కువసేపు నిలవలేదు. ఆ తర్వాతి బంతికే శార్దూల్ అద్భుతమైన డెలివరీతో మ్యాజిక్ చేశాడు. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతి అనూహ్యంగా స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను తాకి వికెట్లను గిరాటేసింది. ఆ బంతిని అంచనా వేయడంలో అయ్యర్ పూర్తిగా విఫలమయ్యాడు. బంతి స్వింగ్ అవిన తీరు, వేగం అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఏ దిశ నుంచి బంతి వచ్చిందో కూడా గుర్తించలేని స్థితిలో అయోమయంగా నిలిచిపోయాడు.
వివరాలు
ఒత్తిడిలో పంజాబ్..
వికెట్ తీసిన వెంటనే శార్దూల్ ఆనందంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. మైదానంలో పరుగులు తీస్తూ తన ప్రత్యేక శైలిలో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఒకే ఓవర్లో ఇద్దరు కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపడంతో పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. నెటిజన్లు దీనిని "సీజన్ బెస్ట్ బాల్"గా ప్రశంసిస్తున్నారు. ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో శార్దూల్ చూపిన నైపుణ్యం ముంబై జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
వివరాలు
పంజాబ్ కింగ్స్‌కు నిరాశ..
బలమైన ఆరంభం ఉన్నప్పటికీ, శార్దూల్ వేసిన ఆ ఒక్క ఓవర్ పంజాబ్ పరుగుల వేగాన్ని తగ్గించింది. కెప్టెన్ అయ్యర్ తక్కువ స్కోరుకే వెనుదిరగడం జట్టుపై ఒత్తిడిని పెంచింది. బుమ్రా తీసుకున్న వ్యూహం ఫలించడంతో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై పట్టును సాధించింది. ఈ అద్భుతమైన డెలివరీ ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోయే వికెట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
#MI bowlers on the mark 🎯
— IndianPremierLeague (@IPL) May 14, 2026
🎥 Shardul Thakur and Raj Bawa hitting the top of off 😮🔥
Updates ▶️ https://t.co/idtc2OTLbP#TATAIPL | #KhelBindaas | #PBKSvMI | @mipaltan pic.twitter.com/eGyWOeXudm