Page Loader
Asian Games 2023: షెఫాలీ వర్మ సన్సేషనల్ హాఫ్ సెంచరీ.. వరుణుడు అడ్డుకున్నా సెమీస్‌లోకి టీమిండియా
షెఫాలీ వర్మ సన్సేషనల్ హాఫ్ సెంచరీ.. వరుణుడు అడ్డుకున్నా సెమీస్‌లోకి టీమిండియా

Asian Games 2023: షెఫాలీ వర్మ సన్సేషనల్ హాఫ్ సెంచరీ.. వరుణుడు అడ్డుకున్నా సెమీస్‌లోకి టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2023
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్‌లో మలేషియాతో భారత మహిళల జట్టు తలపడింది. అయితే వర్షం కారణంగా ఫలితం లేకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత మహిళా జట్టు నేరుగా సెమీఫైనల్‌కి అర్హత సాధించడం విశేషం. వర్షం కారణంగా తొలుత ఈ మ్యాచును 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, షెఫారీ వర్మ సన్షేషనల్ హాఫ్ సెంచరీతో భారీ స్కోరు చేసింది. షెఫాలీవర్మ కేవలం 39 బంతుల్లోనే (ఐదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు) 69 పరుగులు చేసింది. రొడ్రిగాస్ కూడా 19 బంతుల్లో (ఆరు ఫోర్లు) 47 పరుగులు చేసి రాణించింది.

Details

ఆసియా గేమ్స్ మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసిన షెఫాలీ వర్మ

15 ఓవర్లలో భారత మహిళల జట్టు 2 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. భారత బౌలర్లు మొదటి నుంచి మలేషియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో పవర్లే ముగిసే సమయానికే ఓ వికెట్ కోల్పోయి 62 పరుగులు చేసింది. 16 బంతుల్లో 27 పరుగులు చేసి స్మృతి మంధాన, మహీరా ఇజ్జతీ ఇస్మాయిల్ చేతిలో ఔటైంది. అయితే ఆసియా గేమ్స్ లో మొట్టమెదటి హాఫ్ సెంచరీ చేసిన భారత్ క్రికెటర్‌గా షెఫాలీ వర్మ రికార్డు క్రియేట్ చేసింది. మలేషియా బ్యాటింగ్ మొదలవ్వగానే వర్షం కారణంగా మరోసారి మ్యాచ్ ఆగిపోయింది. ఇక వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాప్ ర్యాంకులో ఉన్న భారత జట్టు సెమీ ఫైనల్ కి అర్హత సాధించింది.