తదుపరి వార్తా కథనం

Shikhar Dhawan : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 24, 2024
08:40 am
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శిఖర్ ధావన్ సంచలన ప్రకటన చేశారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించారు. అలాగే డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా ధావన్ తెలియజేశారు.
తాను క్రికెట్ ప్రయాణంలో ఓ అధ్యాయాన్ని ముగించానని, తనపై చూపిన అభిమానం, ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని చెప్పారు.
Details
భారత్ తరుఫున 167 వన్డేలు ఆడిన ధావన్
టీమిండియా తరుఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చారు.
ఈ ప్రయాణంలో తనకు ఎంతోమంది సాయం చేశారని, వారివల్లే ఈ స్థాయికి వచ్చానన్నారు.
భారత్ తరుఫున ఆడేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ధావన్‌కు అవకాశాలు రాలేదు.
ఇప్పటివరకూ టీమిండియా తరుఫున ఆయన 34 టెస్టులు, 68 టీ20లు, 167 వన్డే మ్యాచులు ఆడాడు.