హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్
ఐపీఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావర్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధావన్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టుకు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈ ఇన్నింగ్స్ కు శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఆ అవార్డు అందుకొనే క్రమంలో ప్రముఖ మ్యాచ్ ప్రెజెంటర్ హర్షా భోగ్లే, ధావన్ మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది.
హార్షాభోగ్లేని ప్రశ్నించిన శిఖర్ ధావన్
శిఖర్ ధావన్ తన స్ట్రైక్ రేటును మరింత పెంచుకోవాలని, అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగిందని, ముఖ్యంగా గహహుతి వంటి వికెట్‌పై మరింత దూకుడుగా ఆడాల్సి ఉందని హర్షా బోగ్లే ట్విట్ చేశారు. నా స్ట్రైక్ రేటుతో ప్రస్తుతం మీరు సంతోషంగా ఉన్నారా అని ధావన్ నవ్వుతూ హార్షాభోగ్లేని ప్రశ్నించారు. అందుకు బదులుగా ఈ మ్యాచ్ మీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఆడిన ఇన్నింగ్స్ వర్ణాతీతమని, మీ స్ట్రైక్ రేట్ పట్ల సంతోషంగా ఉన్నానని హార్షాభోగ్లే సమాధానం ఇచ్చాడు.