పొలిటికల్ కెరీర్‌పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది మయాంక్ అగర్వాల్ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటికే పంజాబ్ టీం కలిసి తమ గ్రౌండ్ మొహలీల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. గతంలో శిఖర్ ధావన్ మైదానంలో ఎన్నో వీరోచిత ఇన్నింగ్స్‌లు టీమిండియాకు విజయాలను అందించాడు. జాతీయ జట్టుకు అనేకసార్లు కెప్టెన్ గా శిఖర్ వ్యవహరించి, అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో శిఖర్ ధావన్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో చేరుతారా అని ధావన్‌ని ఓ విలేకరి ప్రశ్నించాడు.
రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి ప్రణాళికలు లేవు : ధావన్
ప్రస్తుతం రాజకీయాలపై తన వద్ద ఎలాంటి ప్రణాళికలేవీ లేవని, భవిష్యత్తులో ఏదైనా అవకాశం వచ్చినా వెనకడుగు వేయనని ధావన్ స్పష్టం చేశాడు. తాను ఏ రంగానికి వెళ్లినా వందశాతం రాణిస్తానని, తాను 11 సంవత్సరాల వయస్సు నుండి కష్టపడి పనిచేస్తున్నానని, ప్రతి ఫీల్డ్‌లో విజయ మంత్రం ఉంటుందని, స్పోర్ట్స్ టాక్‌లో ధావన్ మాట్లాడారు. శుభ్‌మన్ గిల్‌ని వన్డేల్లోకి తీసుకుని సెలక్టర్లు, కెప్టెన్, కోచ్ సరైన నిర్ణయం తీసుకున్నారని, అతడు నాకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నారని, ఒకవేళ తాను సెలక్టర్‌గా ఉంటే.. శుభ్‌మన్ గిల్‌కే అవకాశం ఇచ్చేవాడిని అతడు చెప్పారు.