Page Loader
ఆసియా కప్‌ పాక్‌లో.. ఇండియా మ్యాచ్‌ల మాత్రం విదేశాల్లో..!
13 రోజుల పాటు జరగనున్న ఆసియా కప్

ఆసియా కప్‌ పాక్‌లో.. ఇండియా మ్యాచ్‌ల మాత్రం విదేశాల్లో..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ -2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి పాకిస్థాన్ అతిథ్యమివ్వనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, భద్రతా పరమైన కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇండియా సుముఖంగా లేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని తెలిపింది. దీంతో ఆసియా కప్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఏసీసీ ఆధ్వర్యంలో పీసీబీ, బీసీసీఐ బోర్డులు సమావేశమయ్యాయి. టోర్నీ పాకిస్తాన్ లోనే జరుగుతుందని ఏసీసీ తెలిపింది. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బీసీసీఐ

పంతం నెగ్దించుకున్న బీసీసీఐ

ఇండియా మ్యాచ్‌లకు శ్రీలంక, ఒమన్, యూఏఈ, బంగ్లాదేశ్‌లు ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు తెలిసిందే. ఈ వేదిక నిర్ణయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. ఒకవేళ టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్తు బుక్‌ చేసుకుంటే.. ఫైనల్‌ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఆసియా కప్‌ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకుందని చెప్పొచ్చు. ఆసియా కప్ లో మొత్త ఆరు దేశాలు పాల్గొననుండగా.. . మొత్తం 13 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.