LOADING...
Shivam Dube The Finisher: శివమ్ దూబేనే అసలైన టీమిండియా ఫినిషర్!
శివమ్ దూబేనే అసలైన టీమిండియా ఫినిషర్!

Shivam Dube The Finisher: శివమ్ దూబేనే అసలైన టీమిండియా ఫినిషర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2026
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో ఫినిషర్‌ పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఇన్నింగ్స్‌ చివర్లో స్కోర్‌బోర్డు వేగంగా పరుగెత్తించాలన్నా, జట్టును విజయతీరాలకు చేర్చాలన్నా ఫినిషర్‌ కీలకం. గతంలో భారత టీ20 జట్టుకు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనిలు ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం రిషబ్ పంత్, శివందూబే, రింక్ సింగ్ ఆ పాత్రలో కనిపిస్తున్నారు. వీరిలో దూబే మాత్రం ఫినిషర్‌గా తనదైన ముద్ర వేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గత 12 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో దూబే చూపించిన స్థిరత్వం, దూకుడు టీమిండియాకు పెద్ద బలంగా మారింది.

Details

మంచి ఫామ్ లో శివం దూబే

ఆ 12 ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి: 10*(3), 10*(4), 9(4), 36*(18), 65(23), 7*(2), 0(1), 23(16), 27(17), 66(31), 42(37), 8*(4). మొత్తంగా 303 పరుగులు సాధించిన దూబే సగటు 43.28గా నమోదైంది. అతని స్ట్రైక్‌రేట్‌ 189.37 ఉండటం అతని దూకుడును స్పష్టంగా తెలియజేస్తోంది. అవసరమైన సమయంలో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ను ముగించే సామర్థ్యం దూబే ప్రత్యేకత. మధ్య ఓవర్లలో క్రీజులోకి వచ్చి మ్యాచ్‌ పరిస్థితిని అంచనా వేసి ఆడటం, చివరి దశలో వేగం పెంచడం అతడి శైలి. 23 బంతుల్లో 65, 31 బంతుల్లో 66 పరుగుల ఇన్నింగ్స్‌లు అతని ఫినిషింగ్‌ నైపుణ్యాన్ని స్పష్టం చేశాయి.

Details

ఒత్తిడిలోనూ ధైర్యంగా ఆడటం దూబే లక్షణం

ఒత్తిడిలోనూ ధైర్యంగా ఆడటం దూబే బలమైన లక్షణం. ICC T20 World Cup 2026 టోర్నీలో అతడు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. వెస్టిండీస్‌పై జరిగిన చావోరేవో మ్యాచ్‌లో 19వ ఓవర్లో రెండు కీలక బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. దాంతో చివరి ఓవర్లో భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. ఫినిషర్‌గా బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ దూబే ఇప్పుడు జట్టుకు కీలక ఆయుధంగా మారుతున్నాడు. వరుసగా మంచి ప్రదర్శనలు ఇస్తూ జట్టులో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు కేవలం ఆల్‌రౌండర్‌గానే కాకుండా, టీమిండియాకు నిజమైన 'ఫినిషర్‌'గా అవతరిస్తున్నాడు.

Advertisement