LOADING...
Abhishek Sharma: అభిషేక్ శర్మకు షాక్? మరో ఆటగాడికి గోల్డెన్ ఛాన్స్!
అభిషేక్ శర్మకు షాక్? మరో ఆటగాడికి గోల్డెన్ ఛాన్స్!

Abhishek Sharma: అభిషేక్ శర్మకు షాక్? మరో ఆటగాడికి గోల్డెన్ ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో పరాజయం పాలవడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ నష్టమే కాకుండా సెమీఫైనల్ అవకాశాలపై కూడా ప్రభావం చూపింది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరగబోయే కీలక పోరులకు ముందు ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్ద మార్పులు చేయాలని గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Details

అభిషేక్ శర్మపై వేటు?

తాజా సమాచారం ప్రకారం వరుసగా విఫలమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానం ప్రమాదంలో పడింది. కడుపు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ఆయన పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతని స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకురావాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Details

లెఫ్ట్-రైట్ కాంబినేషన్ అవసరం

ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్ మొత్తం ఎడమచేతి బ్యాటర్లతోనే (అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ) నిండిపోయింది. ఇది ప్రత్యర్థి జట్ల స్పిన్నర్లకు అనుకూలంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేయాలని కోచింగ్ సిబ్బంది ఆలోచిస్తున్నారు. సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోష్చేట్ మాట్లాడుతూ, "సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు. అతన్ని టాప్ ఆర్డర్‌లోకి తీసుకుంటే రైట్-లెఫ్ట్ కాంబినేషన్ సాధ్యమవుతుంది. జట్టులో మార్పులపై రాబోయే రెండు రోజుల్లో చర్చిస్తామని తెలిపారు.

Advertisement

Details

తిలక్, రింకూ ప్రదర్శనపై అనుమానాలు

అభిషేక్ మాత్రమే కాదు, తిలక్ వర్మ, రింకూ సింగ్ ప్రదర్శనలపైనా యాజమాన్యం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో కనీసం ఒకరిని పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ హిట్టర్‌గా పేరున్న రింకూ సింగ్ దక్షిణాఫ్రికాపై డకౌట్ కావడం మిడిల్ ఆర్డర్ బలహీనతను బయటపెట్టింది. ముందున్నవి నాకౌట్ మ్యాచ్‌లే భారత్ తదుపరి మ్యాచ్‌లను జింబాబ్వే, వెస్టిండీస్‌తో ఆడాల్సి ఉంది. సెమీఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం తప్పనిసరి. అంతేకాకుండా నెట్ రన్‌రేట్‌ను కూడా గణనీయంగా పెంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ శైలిలో దూకుడైన నిర్ణయాలు ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement