రిషబ్ పంత్ డబ్బులు, నగలు కాజేసిన జనాలు
భారత్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న భారత్ అభిమానులు అందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి. కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటికి రావడంతో పంత్ సురిక్షితంగా ప్రాణాల నుంచి బయటపడ్డారు. కారు, రోడ్డు డివైడర్ ని ఢీకొట్టిన 6 నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. స్థానికులు కారు ప్రమాదాన్ని గుర్తించారు. ఈ సమయంలో కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్ని రక్షించడానికి బదులుగా కారులో ఉన్న విలువైన నగలు, రూ.7వేలు నగదు తీసుకొని పారిపోయినట్లు తెలుస్తోంది.
నగలు కాజేసినట్లు వార్తలు
న్యూ ఇయర్ కి తల్లికి సర్ ప్రైజ్ ఇవ్వాలని పంత్ తల్లి కోసం, స్నేహితుల కోసం కానుకులను కొనుగోలు చేశారు. అయితే ఈ వస్తువులు దొంగలించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై రిషబ్ పంత్ నోరు విప్పితే కాని అసలు ఏం జరిగిందో క్లారిటీ వచ్చే ప్రసక్తి కనపడడం లేదు. పంత్ అతి కష్టం మీద బయటికొచ్చి అంబులెన్స్ కు ఫోన్ చేశాడని తెలుస్తోంది. కారు మంటల్లో కాలిపోతున్న చాలామంది వాహనదారులు పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోవడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. రిషబ్ పంత్‌ని గుర్తించిన మరికొందరు ప్రయాణికులు అతనికి సాయం చేసినట్లు తెలుస్తోంది.