Page Loader
Paris Olympics : మరో పతకంపై గురి పెట్టిన షూటర్ మనూ భాకర్
మరో పతకంపై గురి పెట్టిన షూటర్ మనూ భాకర్

Paris Olympics : మరో పతకంపై గురి పెట్టిన షూటర్ మనూ భాకర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2024
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన తలి భారతీయ మహిళగా మనూ భాకర్ రికార్డుకెక్కింది. ఈ షూటర్ మరో పతకంపై గురి పెట్టింది. 10 మీటర్ల పిస్తోల్ మిక్సెడ్ ఈవెంట్ బ్రాంజ్ మెడల్ కు మనూ భాకర్‌కి అర్హత లభించింది. ఈ పోటీలో అమెతో పాటు టీమ్‌లో సరబ్ జోత్ ఉన్నాడు.

Details

బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌ కు అర్హత సాధించిన మనూ భాకర్, సరబ్ జోత్

పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శణ చేస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్సెడ్ టీమ్ ఈవెంట్ లో భారత షూటర్లు బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించడం విశేషం. మనూ భాకర్, సరబ్ జోత్ సింగ్ జోడీ ఈ ఈవెంట్‌కు ఎంపికయ్యారు. క్వాలిఫికేషన్ రౌండ్ ఈ బృందం మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక జూలై 20వ తేదీన మెడల్ మ్యాచ్ జరగనుంది.