
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్‌లో వన్ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు ప్రవేశించింది. ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన పంజాబ్ 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శ్రేయస్ అయ్యర్ మేజిక్ ఈ గెలుపులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలకపాత్ర పోషించాడు. అతడు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో శ్రేయస్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు. మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిచి, వాటిని ఫైనల్‌కు చేర్చిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
Details
మూడు జట్లకు ఫైనల్ టికెట్
2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 2025లో పంజాబ్ కింగ్స్‌కు ఫైనల్ బరిలోకి దారి చూపించాడు. రెండో అరుదైన రికార్డు కెప్టెన్ శ్రేయస్ మాత్రమే కాదు, పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా అరుదైన ఘనత సాధించాడు. మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన మొదటి ప్రధాన కోచ్‌గా తన పేరు చరిత్రలో లిఖించుకున్నాడు. 2015లో ముంబై ఇండియన్స్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు.
Details
ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు
ఇక డేనియల్ వెట్టోరి, స్టీఫెన్ ఫ్లెమింగ్‌లు ఇప్పటికే కోచ్‌గా రెండేసి జట్లను మాత్రమే ఫైనల్‌కు తీసుకెళ్లారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఈ భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లు ముగిసే సరికి ఛేదించి ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం పంజాబ్ కింగ్స్‌కు మాత్రమే కాదు, శ్రేయస్ అయ్యర్, రికీ పాంటింగ్‌లకు కూడా ఐపీఎల్‌లో మైలురాయిగా నిలిచింది.