వరల్డ్ కప్ కోసం సర్జరీని వాయిదా వేసుకున్న శ్రేయాస్ అయ్యర్
టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అయ్యర్.. నాలుగో టెస్టులో సభ్యుిడగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగలేదు. జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగినే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ పైనల్‌లో టీమిండియా తలపడనుంది. ఒకవేళ అయ్యర్‌కు సర్జరీ జరిగితే 6-7నెల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్, వన్డే వరల్డ్ కప్ కు అయ్యర్ తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వెన్ను సమస్యను సరి చేసుకోవడానికి సర్జరీ చేయించుకోవాలన్న నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనను అయ్యర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా టీమిండియా తరుపున వరల్డ్ కప్ ఆడాలని అయ్యర్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.
అయ్యర్ ఐపీఎల్‌లో సాధించిన రికార్డులివే
అయ్యర్ 2021లో కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు అరంగేట్రంలో సెంచరీ కొట్టి రికార్డు సాధించాడు. టెస్టు చరిత్రలో అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన 10వ భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 44.40 సగటుతో 666 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలున్నాయి. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ డాక్టర్ల సలహాతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ 101 మ్యాచ్ లు ఆడిన అయ్యర్ 31.55 సగటుతో 2,776 పరుగులు చేశాడు.ఇందులో 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయ్యర్ కేకేఆర్ తరుపున గత సీజన్‌లో 30.84 సగటుతో 401 పరుగులు చేశాడు.