తదుపరి వార్తా కథనం
IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 02, 2025
06:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులు, హార్ధిక్ పాండ్యా 45 పరుగులతో రాణించడంతో భారత్ 249 పరుగులు చేయగలిగింది.
Details
5 వికెట్లతో చెలరేగిన హెన్సీ
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (15), గిల్(2), విరాట్ కోహ్లీ (11) కేఎల్ రాహుల్ (23) నిరాశపరిచారు.
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్సీ 5 వికెట్లతో చెలరేగడంతో భారత తక్కువ పరుగులకే వెనుతిరిగింది.
న్యూజిలాండ్ గెలుపునకు 250 పరుగులు అవసరం