LOADING...
Shreyas Iyer: మీడియాపై అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్.. అంత కోపమెందుకో..?
మీడియాపై అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్.. అంత కోపమెందుకో..?

Shreyas Iyer: మీడియాపై అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్.. అంత కోపమెందుకో..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా 106 మీటర్ల భారీ సిక్సర్ బాది రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు షార్ట్‌ బాల్స్‌ను ఆడే క్రమంలో ఔటై అయ్యర్ పెవిలియన్‌కు చేరిన సందర్భాలే ఎక్కువ. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో శ్రేయస్ అయ్యర్ జర్నలిస్టులపై అసహనం వ్యక్తం చేశాడు. షార్ట్ పిచ్ బాల్ ఆడటంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని ఓ విలేకరి అడిగాడు. దీంతో అయ్యర్, జర్నలిస్టుపై మండిపడ్డారు.

Details

14సార్లు షార్ట్ పిచ్ బంతులకు ఔటైన అయ్యర్

తాను షార్ట్ పిచ్ బాల్ ఆడటంతో ఇబ్బంది పడతాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇదంతా మీడియా చేస్తున్న ప్రచారమే అని అయ్యర్ ఖండించాడు. బ్యాటర్ రెండు, మూడు సార్లు క్లీన్ బౌల్డ్ అయితే పేస్, స్వింగ్ బౌలింగ్ ఆడటం రాదని చెప్పగలరా అంటూ సదరు విలేఖరిని అయ్యర్ ప్రశ్నించాడు. ఇప్పటివరకు 48 వన్డేలు ఆడిన అయ్యర్ భారత్‌ పిచ్‌లపై 8 సార్లు, విదేశీ పిచ్‌లపై 6 సార్లు.. ఇలా మొత్తం 14 సార్లు షార్ట్ పిచ్ బాల్స్‌కు ఔట్ అయ్యాడు.