Rohit Sharma: శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నమ్మకాన్ని నిలబెట్టారు : రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.
భారత్‌లాగే ఈ ప్రపంచ కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను జట్టును భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది.
ఆదివారం జరిగిన మ్యాచులో టీమిండియా బౌలర్లకు దెబ్బకు సౌతాఫ్రికా 83 పరుగురలకే ఆలౌటైంది.
ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో టీమిండియా పేసర్లు సక్సెస్ అవుతున్నారు.
ఇక మహ్మద్ షమీ భారత జట్టులోకి రావడంతో భారత్ పేస్ మరింత పదునుగా మారింది.
మరోవైపు భారత్ స్టార్ ఆటగాడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Details
పరిస్థితులకు అనుగుణంగా పరుగులు రాబడతాం: హిట్ మ్యాన్
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్, పేసర్ మహ్మద్ షమీ ఈ ప్రపంచ కప్‌లో మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని నిలబెట్టారని రోహిత్ శర్మ పేర్కొన్నారు.
గిల్ తో కలిసి చాలా కాలం పాటు బ్యాటింగ్ చేస్తున్నానని, తాము ఏదీ ముందుగా ప్లాన్ చేసుకొని బరిలోకి దిగమని, అయితే మైదానంలో అంచనాలకు అనుగుణంగా పరుగులు రాబట్టుతామని చెప్పారు.
మరోవైపు రవీంద్ర జడేజా కూడా 15 బంతుల్లో 29 పరుగులు చేసి భారత్‌కు విలువైన పరుగులు అందించాడన్నారు.
అదే విధంగా బౌలింగ్ ఐదు వికెట్ల పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడని రోహిత్ పేర్కొన్నాడు.