LOADING...
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా ఎంపిక
ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా ఎంపిక

Shreyas Iyer: ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా ఎంపిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌-2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు త్వరలో మరో బంపరాఫర్‌ ఉంది. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగబోయే రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం శ్రేయస్‌ భారత-ఏ జట్టు కెప్టెన్‌గా ఎంపికవుతాడని సమాచారం. ఈ సిరీస్‌లో శ్రేయస్‌తో పాటు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్‌, సాయి సుదర్శన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రజత్‌ పాటిదార్‌, ఎన్‌ జగదీసన్‌, కరుణ్‌ నాయర్ తదితర ఆటగాళ్లు కూడా ఎంపిక అవుతారని తెలుస్తోంది. శ్రేయస్‌ పలు ఫార్మాట్లలో రాణించినప్పటికీ, టీమిండియా ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌గా నిలవలేకపోయాడు

Details

కెప్టెన్ గా మరో అవకాశం

. వన్డేల్లో మాత్రమే అతనికి అవకాశాలు వస్తున్నాయి. ఆటగాడిగా మాత్రమే కాక, కెప్టెన్‌గా కూడా సఫలత సాధించిన శ్రేయస్‌ టీ20, టెస్ట్‌ జట్లలో స్థానం ఆశిస్తున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టును ఫైనల్స్‌కి తీసుకెళ్తూ శ్రేయస్‌ కెప్టెన్‌గా విజయవంతమైన రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత, భారత్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో భాగంగా ఉన్నాడు. అంతేకాక, త్వరలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌లో శ్రేయస్‌ ఎంపిక కానందున నిరాశ చెందిన ఆటగాడు, ఇప్పుడు ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌లో మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

Details

టెస్టు తర్వాత మూడు వన్డే మ్యాచులు

ఈ సిరీస్‌లో భారత-ఏ జట్టు ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు, ఆతర్వాత మూడు వన్డేలు ఆడనుంది. టెస్ట్‌ మ్యాచ్‌లు లక్నో ఎకానా స్టేడియంలో, వన్డేలు కాన్పూర్ గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో జరుగనున్నాయి. ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్‌ 16 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఏ తరఫున కూడా కొంతమంది స్టార్‌ ఆటగాళ్లు పాల్గొనవచ్చు. ఇప్పటికే జాతీయ జట్టులో ఆడి, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లను ఆసీస్‌ సెలెక్టర్లు ఎంపిక చేయవచ్చని సమాచారం ఉంది.