LOADING...
#Viral Moment: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన రోహిత్, సూర్యకుమార్ యాదవ్
శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన రోహిత్, సూర్యకుమార్ యాదవ్

#Viral Moment: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన రోహిత్, సూర్యకుమార్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
10:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ ముంబయి ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 24వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium) వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్‌తో హైలైట్‌గా నిలిచాడు. బౌండరీ గేట్ దగ్గర గాల్లోకి ఎగిరి మరీ అతను పట్టిన ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పెవిలియన్‌కు చేరాడు.

వివరాలు

గాల్లోకి ఎగిరి పట్టిన అయ్యర్

పంజాబ్ బౌలర్ మార్కో యాన్సెన్ వేసిన బంతిని హార్దిక్ పాండ్యా భారీ షాట్‌గా సిక్సర్ కోసం ఆడాడు. అయితే బంతి బౌండరీ వైపు దూసుకెళ్తుండగా, అక్కడే ఉన్న శ్రేయాస్ అయ్యర్ గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. బ్యాలెన్స్ కోల్పోయినప్పటికీ, వెంటనే వెనుక ఉన్న బార్ట్‌లెట్‌కు బంతిని అందించడంతో హార్దిక్ పాండ్యా ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్యాచ్ అనంతరం శ్రేయాస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ అభిమానుల వైపు ర్యాగింగ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేశాడు. చేతులతో సంకేతాలు చేస్తూ "ఇప్పుడు నోర్లు మూయండి" అన్నట్లుగా హావభావాలు ప్రదర్శించాడు.

వివరాలు

సెంచరీతో చెలరేగిన డికాక్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మొత్తం 20 ఓవర్లు ఆడి 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ లేకపోవడంతో క్వింటన్ డికాక్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టి అద్భుతంగా రాణించాడు. అతను 60 బంతుల్లో 112 పరుగుల సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుదిరగగా, నమన్ ధీర్ 50 పరుగులతో రాణించాడు. వీరి ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించగలిగింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement