Robin Uthappa: అతడి వల్లే శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది!: రాబిన్ ఉతప్ప
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ (BCCI) ఇటీవల 2026 టీ20 వరల్డ్‌కప్ (ICC Mens T20 World Cup) కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో శుభ్‌మన్‌గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్నీ కోల్పోయాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా ఇటీవల ఫామ్‌లో పడిపోవడం కారణంగా ఇబ్బంది పడ్డాడు. అతను గడచిన 22 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేదని, కేవలం రెండు సార్లు మాత్రమే 25 పైన పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) తన యూట్యూబ్ ఛానల్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వివరాలు
స్కై ఔట్ ఆఫ్ ఫామ్
"వరల్డ్ కప్ కోసం జట్టులో ఫామ్ లో లేని ఒక్క ఆటగాడిని మాత్రమే కొనసాగించవచ్చు. అంతకంటే ఎక్కువ మందిని జట్టులో చేర్చలేము. సూర్యకుమార్ యాదవ్ ఈ మధ్య ఎక్కువ పరుగులు సాధించడంలేదు. అందుకే శుభ్‌మన్ గిల్ జట్టులో తన స్థానం కోల్పోయినట్లు అనిపిస్తోంది," అని ఉతప్ప చెప్పారు. "'స్కై ఔట్ ఆఫ్ ఫామ్ అని నేను చెప్పలేను.. కానీ అతను 'ఔట్ ఆఫ్ రన్స్' లో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో పరుగులు చేయలేకపోతున్నాడు, కొంచెం గందరగోళంగా కనిపిస్తున్నాడు. మరోవైపు, లుంగి ఎంగిడి అద్భుతంగా బౌలింగ్ చేసి గిల్‌ను తన బంతులతో ఇబ్బంది పెట్టాడు" అని రాబిన్ వివరించాడు.
వివరాలు
నేను షాక్ అయ్యా: రాబిన్
అలాగే, టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును చూసిన తర్వాత తాను ఆశ్చర్యానికి గురయినట్లు ఉతప్ప తెలిపారు. "నేను నిజంగా షాక్ అయ్యా. నిద్రలోంచి లేచి ఫోన్‌ను చూశాను. చాలా ఆనందపడ్డాను. జట్టు నిజంగా దృఢంగా ఉంది. అయితే మొదటగా గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించకపోవడం కొంత ఆశ్చర్యంగా ఉంది," అని రాబిన్ ఉతప్ప చెప్పారు.