బాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్
శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మొదటి డబుల్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇండోర్‌లో కేవలం 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లు ఆడి 73.8 సగటుతో 1254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం గిల్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ 360 పరుగులు చేసి బాబర్ అజమ్ రికార్డును సమం చేశాడు. ఇప్పటికే భారత్ తరపున తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు చేసి రికార్డుకెక్కాడు.
గిల్ సాధించిన రికార్డులివే
2016-17 సీజన్‌లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 360 పరుగులు చేశాడు. 2018లో జింబాబ్వేపై బంగ్లాదేశ్ ఆటగాడు ఇమ్రుల్ కయేస్ 349 పరుగులు, 2013లో భారత్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ 342 పరుగులు చేశారు. ప్రస్తుతం వారి రికార్డును గిల్ అధిగమించాడు. గత పది ఇన్నింగ్స్‌లో గిల్ పరుగులు 49, 50, 45, 13, 70, 21, 116, 208, 40, 112 పరుగులు చేశాడు. ముఖ్యంగా రోహిత్, గిల్ ఓపెనింగ్ జోడి అద్భుతంగా రాణించింది. మూడో వన్డేల్లో 25 ఓవర్లకు 200 పైగా పరుగులు సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం.