
India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్ గిల్ ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత టెస్టు క్రికెట్‌లో ఒక కొత్త శకానికి శ్రీకారం చుడుతూ, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది.
అనేక ఊహాగానాల మధ్య, గిల్‌ను టెస్టు జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఆయనకు వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను నియమించింది.
ఈ సందర్భంగా జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా జట్టును శనివారం ప్రకటించింది.
మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును బీసీసీఊ ఎంపిక చేసింది.
Details
భారత జట్టు ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్