LOADING...
IPL 2026: గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లకు భారీ షాక్
గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లకు భారీ షాక్

IPL 2026: గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లకు భారీ షాక్

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
09:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోరు నమోదు చేశారు. ఈ భారీ స్కోరు వెనుక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84 పరుగులు), సాయి సుదర్శన్ (55 పరుగులు) అద్భుత అర్ధశతకాలు కీలక పాత్ర పోషించాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 118 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు.

వివరాలు

అదరగొట్టిన సాయి సుదర్శన్..గిల్

సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు సాధించగా, గిల్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలింగ్‌ను దెబ్బతీశాడు. ఓపెనర్లు ఇచ్చిన బలమైన ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కూడా కొనసాగించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ వేగంగా ఆడి 20 బంతుల్లో 37 పరుగులు (నాటౌట్) చేశాడు. రాహుల్ తెవాటియా కేవలం 4 బంతుల్లో 14 పరుగులు (నాటౌట్) చేసి స్కోరును మరింత పెంచారు.

వివరాలు

భారీ స్కోర్ చేసిన జట్టు..

రాజస్థాన్ బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే భారీగా పరుగులు ఇచ్చారు. బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీసినా 47 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి కొంతవరకు పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో స్వస్థలమైన జైపూర్‌లోనే ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Advertisement