విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై సైమన్ ధుల్ ఫైర్.. ఖండించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 35 బంతుల్లో 50 పరుగులను మార్కును చేరుకున్నారు. అయితే కోహ్లీ హాఫ్ సెంచరీ కోసం నెమ్మదిగా ఆడానని మాజీ న్యూజిలాండ్ ఆటగాడు సైమన్ ధుల్ విమర్శించారు. కోహ్లి 42 నుండి 50 పరుగులకు చేరుకోవడానికి 10 బంతులు ఆడానని, మొదట బుల్లెట్ ట్రైన్‌లా ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ, తర్వాత ఎడ్లబండిలా స్లోగా ఆడానని, కోహ్లీ బ్యాటింగ్‌పై సైమన్‌డౌల్ ఫైర్ అయ్యాడు. అంతకుముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ అజామ్‌పై సైమన్ ధుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ స్పందించాడు.
కోహ్లీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
గతంలో పాకిస్తాన్ ప్లేయర్ బాబార్ అజామ్ పై ఇలాంటి చెత్త పదాలే ఉపయోగించాడని, సైమన్ ధుల్ ఆటను స్పృహ పెట్టి చూడలేదని, కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు చేశాడని, అతను ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని సల్మాన్ బట్ పేర్కొన్నారు. కోహ్లీ జట్టులో స్థానం కోసం పోరాడడం లేదని, యువ ఆటగాళ్లు అయితే మైలురాయి సాధించడానికి ఒకానొక సందర్భంలో నెమ్మదిగా ఆడతారని, అతను ప్రపంచ స్థాయి ఆటగాడిని ఆ విషయాన్ని సైమన్ ధుల్ తెలుసుకోవాలని చెప్పారు. సైమన్ ధుల్ ఇలాంటి చెత్త వ్యాఖ్యలను మానుకోవాలని సల్మన్ బట్ అన్నారు.