Anup Sridhar: భారత స్టార్ షట్లర్ సింధు కొత్త కోచ్‌గా అనూప్ శ్రీధర్
మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ భారత స్టార్ షట్లర్ పివి.సింధు కొత్త కోచ్‌గా నియమితులవుతున్నాడు. ఫిన్లాండ్‌లో జరగబోతున్న ఆర్కిటిక్ ఓపెన్ టోర్నీకి సంబంధించి, అనూప్ త్వరలో సింధుతో కలిసి పనిచేయనుందఅని ఆమె తండ్రి పి.వి. రమణ పేర్కొన్నారు. "సింధు ఇక బెంగళూరులో శిక్షణ తీసుకోదు.ఆమె హైదరాబాద్‌లో ట్రైనింగ్‌లో పాల్గొంటుంది.ప్రస్తుత కోచ్ ఆగస్ సాంటసోతో ఒప్పందం ముగియబోతుండడంతో,కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాము.ఫిన్లాండ్‌లో జరిగే టోర్నీ వరకు అనూప్ శ్రీధర్ ఆమె కోచ్‌గా ఉంటాడు. గతంలో పనిచేసిన కొరియా కోచ్ పార్క్ సంగ్ పేరు కూడా పరిగణనలో ఉన్నా,సింధుకు అతడితో సత్సంబంధాలు లేవు. పార్క్‌ని కోచ్‌గా కొనసాగించడం వల్ల సానుకూల ఫలితాలు లభించలేదు అని భావిస్తున్నాము" అని రమణ తెలిపారు.
2026 ఆసియా క్రీడలపై సింధు దృష్టి
సింధుకు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని, అయితే 2026 ఆసియా క్రీడలపై దృష్టి సారించనుందని ఆయన తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఈ భారత స్టార్, 2020 టోక్యో క్రీడల్లో కాంస్యం నెగ్గింది. 2024 పారిస్ క్రీడల్లో మాత్రం ఆమె క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది.