తదుపరి వార్తా కథనం
Mohammed Siraj: సింగర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సిరాజ్ స్పందన .. ఆ ఒక్క మాటతో అందరిని సైలెంట్ చేశాడు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 27, 2025
09:43 am
ఈ వార్తాకథనం ఏంటి
తాను ఓ ప్రముఖ సింగర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ ఘాటుగా స్పందించారు.
ఆశా భోంస్లే మనుమరాలు, సింగర్ జనై భోంస్లేతో సిరాజ్ డేటింగ్‌లో ఉన్నట్టు ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన సిరాజ్, తమది అన్నాచెల్లెళ్ల బంధమని స్పష్టం చేశారు.
'మేరే ప్యారే బాయ్' అంటూ జనై చేసిన పోస్టుకు సిరాజ్ ప్రతిస్పందిస్తూ హమ్ తుమ్హారే హై సనమ్ సినిమాలోని 'తారోంకా చమక్ తా' పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.
ఈ పాట అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని సూచించడంతో, వీరిద్దరిపై వస్తున్న రూమర్స్‌కు తెలివిగా సిరాజ్ చెక్ పెట్టాడు. ఆయన స్పందనతో ఈ వార్తలపై స్పష్టత వచ్చింది.