Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం,భారత్-ఏ జట్టు హెడ్ కోచ్ సితాన్షు కోటక్‌ను నియమించనున్నట్లు సమాచారం.
టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ బ్యాటింగ్ కోచ్‌ను నియమించాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది.
బ్యాటింగ్‌కు ప్రత్యేకంగా కోచ్‌ను నియమిస్తేనే టీమిండియా వైఫల్యాలను అధిగమించగలదని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
సితాన్షు కోటక్ గతంలో టీమిండియా తాత్కలిక హెడ్ కోచ్‌గా పనిచేసారు.జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో పాల్గొనగా,ఆ సమయంలో సితాన్షు కోటక్ తాత్కలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.
1992-93 వరకు సౌరాష్ట్ర తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన సితాన్షు 130 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 8061 పరుగులు సాధించారు.
15 శతకాలు,55 హాఫ్ సెంచరీలు చేసిన అతని బ్యాటింగ్ యావరేజ్ 41.76.
వివరాలు
కోచ్‌గా సితాన్షు కోటక్
రిటైర్మెంట్ తర్వాత సితాన్షు కోటక్ కోచ్‌గా తన కెరీర్‌ను కొనసాగించారు.
సౌరాష్ట్ర జట్టుకు సారథిగా, అనంతరం సౌరాష్ట్ర హెడ్ కోచ్‌గా పనిచేసిన సితాన్షు, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బ్యాటింగ్ కోచ్‌గా చేరారు.
గత నాలుగేళ్లుగా భారత్-ఏ హెడ్ కోచ్‌గా వ్యవహరించారు. భారత్-ఏ జట్టును బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పర్యటనల్లో పర్యవేక్షించారు.
వివరాలు
త్వరలోనే అధికారిక ప్రకటన
ఫిబ్రవరి నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా సితాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
బీసీసీఐ ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
ఇటీవల టీమిండియా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో, సీనియర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు.
బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోర్డు తమ సపోర్ట్ స్టాఫ్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్‌గా టీ దిలీప్, అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కాటే ఉన్నాయి.