SL vs AFG: తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న ఇబ్రహీం జద్రాన్
హంబన్‌తోటా వేదికగా జరిగిన మొదటి వన్డేలో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(98) తృటిలో సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 268 పరుగులకు అలౌటైంది. లక్ష్య చేధనకు అప్ఘనిస్తాన్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నారు. రహమతుల్లా గుర్బాజ్ (14) పరుగులతో నిరాశపరిచగా.. ఇబ్రహీం జద్రాన్, రహమత్ సాహా అప్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇబ్రహీం 98 బంతుల్లో (11 ఫోర్లు, 2 సిక్సర్లు) 98 పరుగులు, రహమత్ 80 బంతుల్లో (3ఫోర్లు) 55 పరుగులు చేశారు. ఇబ్రహీం, రహ్మత్ షాతో కలిసి రెండో వికెట్‌కు 146 పరుగులను జోడించాడు.
ఇబ్రహీం జద్రాన్ అరుదైన ఘనత
అనంతరం వీరిద్దరూ ఔట్ కావడంతో ఆప్ఘన్ కష్టాల్లో పడింది. యువ ఓపెనర్ ఇబ్రహీం తొమ్మిది వన్డే మ్యాచుల్లో 500 పరుగులు పూర్తి చేసిన 15వ ఆప్ఘన్ ఆటగాడిగా నిలిచాడు. ఇబ్రహీం గత నాలుగు గేమ్‌లలో 94.00 సగటుతో 376 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉంది. జద్రాన్ అత్యంత వేగంగా వన్డేలో 500 రన్స్ ను పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు జన్నెమన్ మలన్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 500 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉండగా.. ఇబ్రహీం 9 మ్యాచుల్లో ఈ మైలురాయిని అందుకొని రెండో ఆటగాడిగా నిలిచాడు. అతని తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన డెన్నిస్ అమిస్, కెవిన్ పీటర్సన్ ఉన్నారు.