Page Loader
SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్ 
సెంచరీతో సత్తా చాటిన అబ్దుల్లా షఫీక్

SL vs PAK: అబ్దుల్లా షఫీక్ సూపర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా పాక్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2023
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. వర్షం కారణంగా 2వ రోజు కొన్ని ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. మూడో ఆటలో తొలి సెషన్ నుంచే పాక్ బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో చెలరేగాడు. రెండో ఆట ముగిసే సమయానికి 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన అబ్దుల్లా షఫీక్ మూడో ఆటలో సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కాగా.. శ్రీలంకపై రెండోది కావడం విశేషం. షఫీక్, షాన్ మసూద్ లు కలిసి మూడో వికెట్‌కు 108 పరుగులను జోడించారు.

Details

టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న అబ్దుల్లా షఫీక్

కుశాల్ మెండిస్ బౌలింగ్‌లో మసూద్ ఔట్ కాగా.. షఫీక్ క్రీజులో నిలబడి పరుగులను రాబట్టుతున్నాడు. అతను బాబర్ అజామ్‌తో 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పాక్ 200 పరుగుల మార్కును దాటాడు. 2021లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసిన షఫీక్ 14 టెస్టుల్లో 1,100 పరుగులను చేశాడు. 2021-23 ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పాకిస్తాన్ తరపున అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడు షఫీక్ నిలిచాడు. బాబర్ 1,527 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌటైంది. ధనుంజయ డిసిల్వా 57, దినేశ్‌ చండిమల్‌ 34 తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో అబ్రర్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లతో విజృంభించాడు.