Page Loader
ENG vs IND: లార్డ్స్ టెస్టులో గిల్‌పై స్లెడ్జింగ్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
లార్డ్స్ టెస్టులో గిల్‌పై స్లెడ్జింగ్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

ENG vs IND: లార్డ్స్ టెస్టులో గిల్‌పై స్లెడ్జింగ్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు కీలక సిరీస్‌ ఆడుతున్న వేళ, కెప్టెన్‌గా తొలిసారి బాద్యతలు చేపట్టిన శుభ్‌మన్‌ గిల్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొన్నదని అంటున్నారు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. లార్డ్స్ వేదికగా మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్ల నుంచి భారత ప్లేయర్లపై తీవ్ర స్థాయిలో స్లెడ్జింగ్‌కు గురయ్యారని ఆయన వెల్లడించారు. గిల్‌తోపాటు పంత్, జడేజా, నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లపైనూ మాటల దాడులు జరిగినట్లు తెలిపారు. అయితే ఇవి సాధారణ స్లెడ్జింగ్‌ కంటే భిన్నంగా, చాలా శ్రుతిమించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

Details

విరాట్ కోహ్లీ అయితే..! 

ఈ సందర్భంలో మంజ్రేకర్ మాట్లాడుతూ శుభ్‌మన్ గిల్ సహనంతో కూడిన ఆటగాడు. అతడిలో కీలక సమయంలో దూకుడూ ఉంటుంది. కానీ లార్డ్స్‌లో నాలుగో రోజుతో పోలిస్తే మూడో రోజు గిల్ అంత అగ్రెసివ్‌గా కనిపించలేదు. అదే విరాట్ కోహ్లీ ఉంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. బ్యాటింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన ఉండేది. గిల్‌ నుంచి అలాంటి దూకుడు కనపడలేదు. ఇంగ్లండ్ ప్లేయర్లను కాస్త కట్టడి చేయాలంటే ధైర్యంగా ఎదురు నిలవాలి. లేదంటే వారు చివరి రోజూ మన ఆటగాళ్లపై దాడులు చేస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు.

Details

స్టంప్ మైక్‌లో స్లెడ్జింగ్ స్పష్టంగా..! 

మరోవైపు మంజ్రేకర్ స్టంప్‌ మైక్‌ అనుభవాల గురించి మాట్లాడుతూ గిల్ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించినప్పటినుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్రంగా మాటల యుద్ధానికి దిగారు. ఇది సాధారణ క్రికెట్ టాకింగ్‌ కంటే వ్యక్తిగత దాడిలా అనిపించింది. స్టంప్ మైక్‌లో ఆ మాటలన్నీ స్పష్టంగా వినిపించాయి. విదేశీ క్రికెటర్లతో మన ఆటగాళ్లకు స్నేహపూర్వక వాతావరణం ఉండేది. కానీ, ఈ సారి పరిస్థితి భిన్నంగా అనిపించిందని పేర్కొన్నారు.

Details

గిల్ కి పెద్ద సవాలు

చివరగా ఇంగ్లండ్ బౌలర్లు నాలుగో రోజు అద్భుతంగా బంతులేశారు అని మంజ్రేకర్ ప్రశంసించారు. గిల్ వాటిని అడ్డుకోవడంలో విజయం సాధించాడని తెలిపారు. 'ఒక్కసారిగా లోపలికి వచ్చిన బంతిని వదిలేశాడు. డిఫెన్స్‌ గేమ్‌లో ఇంకాస్త మెరుగుదల అవసరం ఉంది. అయినా, ఇప్పటివరకు 600కిపైగా పరుగులు చేసిన గిల్‌కు ఇది పెద్ద సవాలుగా ఉండదని అన్నారు.