
గుజరాత్ విజయంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగులతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో గుజరాత్ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.
గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించి తమ జట్టుకు విజయాన్ని అందించారు.
గుజరాత్ 5 విజయాలతో పది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చైన్నై సూపర్ కింగ్స్ పది పాయింట్లతో మెరుగైన నెట్ రన్‌రేట్ సాధించడంతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇక భారీ తేడాతో ఓడిన ముంబై ఏడో స్థానానికి దిగజారింది. నాలుగు విజయాలతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానంలో నిలిచింది.
Details
అగ్రస్థానంలో రషీద్ ఖాన్
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వద్దే ఆరెంజ్ క్యాప్ ఉంది. 7 మ్యాచ్‌ల్లో 405 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. 314 పరుగులతో డేవాన్ కాన్వే రెండో స్థానం, 306 పరుగులతో వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక ముంబై మ్యాచ్ లో రెండు వికెట్లు సాధించిన రషీద్ ఖాన్ 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. తర్వాతి స్థానంలో మహమ్మద్ సిరాజ్(13వికెట్లు), అర్షదీప్ సింగ్(13 వికెట్లు), యుజేంద్ర చాహల్(12 వికెట్లు) తర్వాతి స్థానంలో నిలిచారు.
నేటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.