గుజరాత్ టైటాన్స్ గెలుపుతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మరో బంతి మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నారు. నాలుగు మ్యాచ్‌లో మూడు మ్యాచ్ లు నెగ్గిన గుజరాత్..+1.0341 రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మూడు విజయాలు సాధించినా ప్లస్ రన్ రేట్ కారణంగా గుజరాత్ కన్నా ముందు స్థానంలో ఉన్నాయి. పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కేకేఆర్ నాలుగో స్థానానికి దిగజారింది. చైన్నై 5, పంజాబ్ 6, ఆర్సీబీ 7, ముంబై 8 స్థానాల్లో ఉన్నాయి.
10 వికెట్లతో యుజేంద్ర చాహల్ మొదటి స్థానం
ఇక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నారు. గత మూడ్రోజుల నుండి శిఖర్ ధావన్ మొదటి స్థానంలో కొనసాగుతుండడం గమనార్హం. పంజాబ్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ చేసిన గిల్ 183 పరుగులతో టాప్ 5లోకి వచ్చాడు. ఇక యథావిథిగా వార్నర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ స్టార్ ప్లేయర్ యుజేంద్ర చాహల్ 10 వికెట్లు తీసి తొలి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత రషీద్ ఖాన్, మార్క్ వుడ్ 9 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.