Neeraj Chopra: నీరజ్ చొప్రా తల్లి మనసు నిజంగానే బంగారం.. ఎందుకంటే?
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి చరిత్రకెక్కాడు. దీంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక నీరజ్ కుటుంబ సభ్యుల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయింది. ఫైనల్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌తో నీరజ్ వ్యవహరించిన తీరు నెటిజన్ల మనసును దోచుకుంది. తాజాగా నీరజ్ తల్లి కూడా అర్షద్ నదీమ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అథ్లెటిక్స్‌లో పాకిస్థాన్ కు చెందిన అర్షద్ పై నీరజ్ గెలుపొందడం గురించి, ఓ విలేకరి నీరజ్ తల్లి సరోజ్ దేవిని ప్రశ్నించాడు. దీంతో ఆమె సున్నితంగా జవాబు ఇచ్చింది.
అర్షద్ రజతం గెలుపొందడంపై హర్షం
అథ్లెటిక్స్ లో ఎవరో ఒకరు కచ్చితంగా గెలుస్తారని, కాబట్టి పాకిస్థాన్ లేదా హరియాణా అనే ప్రశ్న ముఖ్యం కాదని, ఎవరైనా విజయం సాధించవచ్చని నీరజ్ దేవి పేర్కొన్నారు. ఒక వేళ ఈ టోర్నీలో అర్షద్ గెలిచినా కూడా తనకు సంతోషంగానే ఉండేదని ఆమె వెల్లడించారు. ఆమె సానుకూల హృదయం పట్ల నెటిజన్లు సరోజా దేవి మనసు నిజంగా బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతేడాది రజతంతో సరిపెట్టుకున్న నీరజ్ చోప్రా.. ఈ సారి పసిడిని ముద్దాడి తన కలను నెరవేర్చుకోవడం గమనార్హం.