Page Loader
SA Vs AUS: వన్డే సిరీస్ సమంపై దక్షిణాఫ్రికా గురి.. రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్
వన్డే సిరీస్ సమంపై దక్షిణాఫ్రికా గురి.. రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్

SA Vs AUS: వన్డే సిరీస్ సమంపై దక్షిణాఫ్రికా గురి.. రేపే ఆస్ట్రేలియాతో మ్యాచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటికే 2-1 అధిక్యంతో నిలిచిన ఆస్ట్రేలియా, మరో మ్యాచులో నెగ్గి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత, ప్రోటీస్ జట్టు మూడో వన్డేలో పుంజుకుంది. ఏకంగా 111 పరుగుల తేడాతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. ఎలాగైనా నాలుగో వన్డేలో ఆసీస్‌పై నెగ్గి సిరీస్‌ను సమం చేసుకోవాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ పిచ్ పేస్, బౌన్స్ కు అనుకూలంగా ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Details

వన్డేల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాకు మెరుగైన రికార్డు

వన్డేల్లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికాకు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఈ రెండు 106 వన్డేల్లో తలపడగా, 52 మ్యాచుల్లో దక్షిణాఫ్రికా గెలుపొందింది. ఇక 50 మ్యాచుల్లో ఆసీస్ గెలవగా, మరో మూడు మ్యాచులు టై అయ్యాయి. ఆస్ట్రేలియా టాప్ ఆర్డ్ బ్యాటర్లు, సౌతాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. సౌతాఫ్రికా తరుపున కెప్టెన్ టెంబా బావుమా, క్వింటాన్ డి కాక్ మాత్రమే పరుగులను రాబడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ మార్నస్ లాబుస్‌చాగ్నే ఈ సిరీస్‌లో రాణిస్తున్నాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ 153.41 స్ట్రైక్ రేట్‌తో 135 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా తరుపున ఐడెన్ మార్‌ర్కమ్ గత మ్యాచులో 74 బంతుల్లో 102 పరుగులతో అజేయంగా నిలిచి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Details

ఇరు జట్లలోని ఆటగాళ్లు

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు తబ్రైజ్ షమ్సీ, గెరాల్డ్ కోయెట్జీ ఆరు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా జట్టు క్వింటన్ డి కాక్ (డబ్ల్యూకే), టెంబా బావుమా (సి), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి. ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (సి), మార్నస్ లాబుషాగ్నే, టిమ్ డేవిడ్, అలెక్స్ కారీ (WK), మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా.